: వచ్చే ఏడాది దేశ వృద్ధిరేటు మెరుగ్గా ఉండొచ్చు: అరుణ్ జైట్లీ
రాబోయే కొత్త సంవత్సరంలో వృద్ధి రేటు మెరుగ్గా ఉండవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, దేశంలో తయారీ రంగం అభివృద్ధి సవాలుగానే ఉందన్నారు. అయితే, పన్ను సంస్కరణలు దేశాన్ని మరింత ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. 2015లో ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మూలధనం అధిక వ్యయం వల్లే తయారీ రంగంలో మందగమనం ఏర్పడిందని జైట్లీ అన్నారు. కాగా ఈ కీలక విభాగంలో వృద్ధి పునరుద్ధరించడానికి సమర్థమైన, కఠినమైన చర్యలు తీసుకోకుంటే తయారీరంగం అభివృద్ధి కాదని మంత్రి వివరించారు. అయినప్పటికీ ఫలితాలు రాత్రికి రాత్రే కనిపించవన్నారు.