: మే 10న ఎంసెట్, 16న ఐసెట్ పరీక్షలు: ఉన్నత విద్యామండలి
మే 10న ఎంసెట్ పరీక్ష, 16న ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 14న ఈసెట్, పీఈసెట్, 25న పీజీసెట్, 28న ఎడ్ సెట్, మే 30న లాసెట్ పరీక్షలు నిర్వహిస్తామని ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి పరీక్షలు, ప్రవేశ ప్రక్రియ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నిర్వహించే అధికారం ఉన్నత విద్యామండలికే ఉందని పునరుద్ఘాటించారు.