: నాగేంద్రబాబుకు 'జగ్గయ్య జాతీయ అవార్డు' ప్రదానం
నిర్మాత, నటుడు నాగేంద్రబాబు 'కొంగర జగ్గయ్య జాతీయ అవార్డు' అందుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్రస్థాయి నాటికల పోటీల సందర్భంగా నాగబాబుకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఆయనకు అవార్డుతో పాటు శాలువా, పూమాలతో సత్కారం చేశారు. దీనిపై నాగబాబు స్పందిస్తూ, సీనియర్ నటుడు జగ్గయ్య పేరిట ఏర్పాటైన అవార్డును అందుకోవడం ఆనందదాయకం అన్నారు.