: తలసానిని కలిసిన తెలుగు సినిమా పెద్దలు
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో టాలీవుడ్ ప్రముఖులు దగ్గుబాటి సురేష్, కేఎస్ రామారావు తదితరులు భేటీ అయ్యారు. త్వరలో చిత్ర పరిశ్రమ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు మంత్రిని కోరారు. అంతేగాకుండా, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు.