: కాసేపట్లో ఎంసెట్ నిర్వహణ తేదీ ప్రకటించనున్న ఉన్నత విద్యామండలి
ఎంసెట్ పరీక్ష నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ పరీక్ష నిర్వహణకు ఉన్నత విద్యా మండలి కాసేపట్లో షెడ్యూల్ ప్రకటించనుంది. దాంతో పాటు ఇతర సెట్ల తేదీలు కూడా వెల్లడిస్తుంది. విభజన చట్ట ప్రకారం ఎంసెట్ నిర్వహణ అధికారం ఏపీ ఉన్నత విద్యా మండలికే ఉందని ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. అడ్వకేట్ జనరల్ ను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం కలసిరావాలని, ఉమ్మడి ఎంసెట్ నిర్వహించే అధికారం తెలంగాణకు లేదని ఆయన స్పష్టం చేశారు.