: తన గీతాల్లో లేడీ గాగాను దూషించిన పాప్ స్టార్ మడోనా!


పాప్ ప్రపంచంలో యువ సంచలనం లేడీ గాగాను దూషిస్తూ మరో స్టార్ మడోనా పాటలు పాడిందట. ఇటీవల మడోనా తాజా ఆల్బమ్ లోని కొన్ని గీతాలు లీక్ అయ్యాయి. వీటిల్లోని 'టూ స్టెప్స్ బిహైండ్' అనే గీతం గాగాను ఉద్దేశించినట్టుగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ గీతంలో 'నువ్వు కాపీ కొడతావు, నీ మనసులో ఎల్లప్పుడూ నేనే ఉంటాను' అనే అర్థం వచ్చేలా చరణాలు ఉన్నాయట. వీటిని గాగాను ఉద్దేశించి మడోనా పాడినట్టు ఆరోపణలు రాగా, వాటిని మడోనా మేనేజర్ ఖండించారు. ఈ పాట గాగానో లేదా మరొకరినో మనసులో ఉంచుకొని రాసింది కాదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News