: థర్మల్ పవర్ ప్లాంట్... పెద్దవీడులో చిచ్చు రేపింది!
తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం పెద్దవీడులో చిచ్చురేపింది. 2,200 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు కోసం కొద్దిసేపటి క్రితం ప్రజాభిప్రాయసేకరణ మొదలైంది. థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంతో తమకు విపరిణామాలు తప్పవని తొలుత వాదించిన గ్రామస్థులు, ఆ తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రజాభిప్రాయసేకరణకు అనుకూలంగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం ప్లకార్డులు చేతబట్టి నినాదాలకు దిగాయి. దీంతో ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. ప్రాజెక్టుకు అనుమతి సాధించేందుకు ప్రభుత్వమే ఓ వర్గం ప్రజలను ఎగదోసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.