: ఆరోపణలు రుజువైతే తల నరకండి: డేరా సచ్చా సౌదా చీఫ్


తాను నపుంసకత్వ ఆపరేషన్ లను ప్రోత్సహిస్తున్నానని వచ్చిన ఆరోపణలు రుజువైతే బహిరంగ శిరశ్ఛేదన శిక్షకు సిద్ధమని డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అన్నారు. "ఈ ఆరోపణలు నూటికి నూరుశాతం తప్పు. నేను ఎవరినీ అలా చేయాలని కోరలేదు. సత్సంగ్ లో లేదా మరెక్కడైనా ఎవరితోనైనా అలా మాట్లాడినట్టు నిరూపిస్తే నా తల నరికించుకోవడానికి సిద్ధం" అని ఆయన తెలిపారు. ఇంతకన్నా తాను ఇంకేమీ చెప్పలేనని అన్నారు. కాగా, గతంలో డేరా అనుచరుడిగా ఉన్న హన్స్ రాజ్ చౌహాన్, ఆశ్రమంలో పురుషులను నపుంసకులుగా మార్చే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని, తనతో పాటు మరో 400 మందికి ఆపరేషన్ లు జరిగాయని ఆరోపిస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్ట్ ఆదేశించింది.

  • Loading...

More Telugu News