: మళ్ళీ రెచ్చిపోయిన మాజీ కానిస్టేబుల్
గుర్తుందా.. గతంలో ఓసారి పోలీస్ ట్రాన్స్ పోర్ట్ విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ ఎస్పీ స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతన్ని హతమారుస్తానంటూ బెదిరించాడో కానిస్టేబుల్. పోలీసు రవాణా విభాగంలోనే పనిచేసిన ఆ మాజీ కానిస్టేబుల్ పేరు శర్మ. అప్పట్లో తీవ్ర కలకలం రేపిన ఆ సంఘటన నాటకీయ పరిణామాల మధ్య సుఖాంతం అయింది. అనంతరం ఆ కానిస్టేబుల్ ను సర్వీసు నుంచి తొలగించారు. ఇన్నాళ్ళూ మౌనం దాల్చిన శర్మ మళ్ళీ రెచ్చిపోయాడు. నేడు హైదరాబాద్ ఎల్బీ నగర్ వద్ద అడిషనల్ ఎస్పీ వెంకటేష్ కు చెందిన వాహనాన్ని తగలబెట్టాడు. పీటీవో ను సంస్కరించాల్సిందేనంటూ మరోసారి డిమాండ్ చేశాడు.