: ఢిల్లీ మెట్రో రైలు జేబుదొంగల్లో 94 శాతం మంది మహిళలేనట!


ఇకపై ఢిల్లీ మెట్రో రైలెక్కే ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించే మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలని సెలవిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఎందుకంటే, ఢిల్లీ మెట్రో రైళ్లలో పోలీసులకు చిక్కిన చోరుల్లో 94 శాతం మంది మహిళలేనట. ఢిల్లీ మెట్రో పరిధిలోని 134 రైల్వే స్టేషన్లలో భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) జవాన్లు అరెస్ట్ చేసిన పిక్ పాకెట్స్ 293 మంది మహిళలు కాగా పురుషులు 22 మంది ఉన్నారట. ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లలో చేతివాటం చూపడంలో మహిళలదే పైచేయట. ఇందుకూ ఓ కారణముందని పోలీసులు చెబుతున్నారు. చంటిపిల్లాడిని చంకనేసుకుని ఆ మహిళలు చేతివాటం ప్రదర్శిస్తారట. సాధారణంగా చంటిపిల్లలతో కనిపించే మహిళల పట్ల చోరీకి సంబంధించిన అనుమానాలు కలగవు కదా. దీనినే ఆసరాగా చేసుకుని సదరు మహిళలు పిక్ పాకెటింగ్ లో పురుషులను మించిపోయారట.

  • Loading...

More Telugu News