: బెంగళూరు పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తు
బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగిన పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. ఉగ్రవాదులు జరిపిన దాడిగా బెంగళూరు పేలుడును అనుమానిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు. నిన్న బెంగళూరులోని చర్చి స్ట్రీట్ లో జరిగిన పేలుడులో ఓ మహిళ మృత్యువాత పడగా, మరో ముగ్గురు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి ఉదయం ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం కేంద్రం ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేలుడులో ఐఈడీ వాడిన నేపథ్యంలో సిమి తరహా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉంటుందని బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.