: హెరిటేజ్ పాలు వాడుతూనే చంద్రబాబును తిట్టాను... వైకాపా మాజీ నేత జూపూడి


తాను వైకాపా పార్టీ విధానాలను అనుసరించి మాత్రమే చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశానని ఆ పార్టీ మాజీ నేత జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. హెరిటేజ్ పాలు వాడితే కాన్సర్ వస్తుందని తాను విమర్శిస్తున్న సమయంలో కూడా, తమ ఇంట హెరిటేజ్ పాలే వాడామని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత బాబు ఆలోచనా విధానం మారిందని, ఆయన మార్గం తనకు నచ్చబట్టే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించినట్టు వివరించారు. తను నిత్యం దళిత అభ్యుదయానికి కృషి చేస్తానని తెలిపారు. కొందరు కావాలని అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించారని విమర్శించారు. తన ప్రశ్నలకు జగన్ నుంచి స్పందన రాకపోవడంతోనే ఆ పార్టీని వీడినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News