: తెలంగాణ టూరిజం ఛైర్మన్‌గా మాజీ డీజీపీ పేర్వారం!
తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో రాములు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేసి, అనంతర కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం టూరిజం చైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.