: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం... పోలీసుల అదుపులో కర్మన్ ఘాట్ వాసి
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి ఉదయం బుల్లెట్ల కలకలం రేగింది. ఢిల్లీ వెళ్లేందుకు వచ్చిన ఓ వ్యక్తి వద్ద పోలీసులు 9 ఎంఎం బుల్లెట్ ను కనుగొన్నారు. వెనువెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. బుల్లెట్ కలిగిన వ్యక్తిని హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ వాసి సునీల్ గా పోలీసులు గుర్తించారు. బుల్లెట్ వెలుగుచూసిన నేపథ్యంలో సునీల్ ను పోలీసులు విచారిస్తున్నారు. అసలు బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, బుల్లెట్ తో బయలుదేరడానికి కారణాలు తదితర వివరాలను వెలికితీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.