: పొగమంచు గుప్పిట్లో ఢిల్లీ... కదలని విమానాలు!
దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. నిన్నటికంటే నేడు మరి కాస్త తగ్గిన ఉష్ణోగ్రత 2.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. దీంతో నగరంపై నేడు మరింత అధికంగా పొగమంచు ఆవరించింది. రాత్రి నుంచి నేటి ఉదయం దాకా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక్క విమానం కూడా కదలలేదు. మరోవైపు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన రైల్వే సర్వీసులు కూడా నిలిచిపోయాయి. నగరంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నగర వీధులపై జన సంచారం కనిపించడం లేదు. మరోవైపు ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో నేటి తెల్లవారుజామున అత్యల్పంగా 0.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.