: మెల్ బోర్న్ టెస్టును అడ్డుకున్న వర్షం


భారత్-ఆస్ట్రేలియాల మధ్య మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 90 పరుగులు చేసిన అనంతరం, భోజన విరామ సమయంలో గాలులు ప్రారంభమై, చిన్నపాటి వర్షం కురిసింది. దీంతో పిచ్ పై కవర్లు కప్పేశారు. గాలి వేగం ఎక్కువగా ఉండటంతో, కవర్లు ఎగిరిపోకుండా గ్రౌండ్స్ మెన్ మేకులు కొట్టారు. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News