: నవ్యాంధ్ర రాజధాని మండలాల్లో గడ్డి వాముల దగ్ధం... ప్రమాదంపై రైతుల అనుమానం
నవ్యాంధ్ర రాజధాని రూపుదిద్దుకోనున్న రెండు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో నేటి రాత్రి ఒకే తరహాలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో గడ్డి వాములతో పాటు అరటి తోటలు కూడా దగ్ధమయ్యాయి. ఒకే రోజు, ఒకే తరహాలో జరిగిన అగ్ని ప్రమాదాలపై అక్కడి రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాలు, తుళ్లూరు మండలం మందడం, లింగాయపాలెం గ్రామాల్లో గుర్తు తెలియని దుండగులు గడ్డివాములతో పాటు అరటి తోటలకు కూడా నిప్పు పెట్టారు.