: భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా 90/1


మెల్బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. నాలుగోరోజు ఆరంభంలోనే టీమిండియాను ఆలౌట్ చేసిన ఆసీస్... ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్ ను ధాటిగా కొనసాగిస్తోంది. ఓపెనర్ వార్నర్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరినా... రోజర్స్ (33), వాట్సన్ (15)లు మరో వికెట్ కోల్పోకుండా సమయానుకూలంగా ఆడుతున్నారు. ఈ క్రమంలో, లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది. దీంతో, ఇప్పటికే ఆసీస్ 155 పరుగుల లీడ్ సాధించినట్టైంది.

  • Loading...

More Telugu News