: ఇక లోకేష్ పరామర్శ యాత్రలు!
మొన్నటిదాకా వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు చేపట్టగా, తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ పరామర్శ యాత్రలకు తెరతీశారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేసిన ఆయన నేడు కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం పర్యటనకు వెళుతున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల యాసిడ్ దాడికి గురైన హసిద అనే యువతిని లోకేష్ పరామర్శించనున్నారు. అంతేకాక ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం లోకేష్ ఆర్థిక సహాయం కూడా అందజేయనున్నారు. మచిలీపట్నం పర్యటనలో భాగంగా లోకేష్, పార్టీ జిల్లా నేతలతోనూ భేటీ కానున్నట్లు సమాచారం.