: మోదీ, నేను పదవుల్లో ఉండటమే ప్రజాస్వామ్యం: స్వామిగౌడ్


భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందనడానికి టీఎస్ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఓ గొప్ప ఉదాహరణ చెప్పారు. దేశ ప్రధానిగా మోదీ, టీఎస్ ఉప ముఖ్యమంత్రిగా మహమూద్ అలీ, మండలి ఛైర్మన్ గా తాను పదవులలో ఉండటమే ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనమని అన్నారు. టీ అమ్మిన మోదీ, పాలు అమ్ముకునే అలీ, అటెండర్ గా జీవితాన్ని ఆరంభించిన తాను ఉన్నతమైన పదవులలో ఉన్నామని... భారత్ లో ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలని చెప్పారు. కేవలం ప్రజాస్వామ్యంలోనే ఇలాంటివి సాధ్యమని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News