: ‘పీకే’పై పెరుగుతున్న నిరసన జ్వాల... నిషేధించాలంటున్న హిందుత్వ వాదులు


బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘పీకే’పై నిరసన గళాలు పెరుగుతున్నాయి. హిందూ దేవుళ్లను కించపరచే రీతిలో చిత్రీకరించిన ఈ చిత్రంపై నిషేధం విధించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొన్నటిదాకా నిరసనలకే పరిమితమైన విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ), భజరంగ్ దళ్ సంస్థలు తాజాగా ఆ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మరోవైపు ‘పీకే’పై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కూడా నిరసన గళమెత్తారు. హిందూ దేవుళ్లను కించపరచేలా ఉన్న పీకే చిత్రాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఇటీవలి కాలంలో హిందూ మతంపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్న చిత్రాలు తరచూ వస్తున్నాయి. బడా యాక్టర్లు కూడా ఈ బాటలోనే నడుస్తున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రాందేవ్ బాబా, సదరు యత్నాలను అడ్డుకునేందుకు హిందువులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పీకే చిత్రంపై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే, ‘పీకే’ వసూళ్లు మాత్రం బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతూ రూ.214 కోట్లు దాటాయి.

  • Loading...

More Telugu News