: మూడు పరుగులు, రెండున్నర ఓవర్లు... 465 పరుగులకు టీమిండియా ఆలౌట్!


బాక్సింగ్ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు దీటుగా సమాధానమిస్తుందనుకున్న టీమిండియా నాలుగో రోజు ఆటలో చేతులెత్తేసింది. కేవలం రెండున్నర ఓవర్ల పాటు నిలిచిన భారత టెయిలెండర్లు, మూడంటే మూడు పరుగులు మాత్రమే చేసి ఇక తమ వల్ల కాదని తేల్చేశారు. దీంతో నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే ఆసీస్ బౌలర్లు మిగిలిన రెండు టీమిండియా వికెట్లను కూల్చేశారు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్సును 465 పరుగులకు ముగించింది. వెరసి ఆసీస్ కంటే 65 పరుగుల వెనుకే నిలిచిపోయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. 4.7 రన్ రేటుతో వన్డేను తలపించేలా ఆడుతున్న ఆసిస్ బ్యాట్స్ మన్ 10 ఓవర్లు ముగిసేసరికే 47 పరుగులు చేశారు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 30 బంతుల్లోనే 38 పరుగులు చేయగా, క్రిస్ రోజర్స్ కాస్త నెమ్మదిగా 31 బంతుల్లో 9 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News