: ప్రొద్దుటూరులో 'లెజెండ్' కోలాహలం
నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' సినిమా 275 రోజుల విజయోత్సవ వేడుకలు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆరంభమయ్యాయి. ఇక్కడి థియేటర్లో 'లెజెండ్' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీంతో, విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బాలయ్య వస్తారని తెలుస్తోంది. తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు.