: సీఆర్డీఏ చట్టాన్ని సవరించాలి: రాఘవులు
రాజధాని భూసేకరణ నిమిత్తం రూపొందించిన సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని సీపీఎం నేత బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామ రైతులతో ఆయన నేడు భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ, సీఆర్డీఏ చట్టం రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందన్నారు. సర్కారు ఈ చట్టంలో మార్పులు తీసుకురాకపోతే రైతులతో కలిసి పోరాడేందుకు సిద్ధమని రాఘవులు ప్రకటించారు.