: హైదరాబాదులో మహాబృంద నాట్యం
హైదరాబాదులో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ప్రారంభమైంది. గచ్చిబౌలిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో నాట్య కళాకారులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహాబృంద నాట్యం పేరిట విశ్వవేదికపై కూచిపూడికి పట్టాభిషేకం చేయనున్నారు. ఈ నాట్య విన్యాసాలను తిలకించేందుకు కళాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.