: 'లెజెండ్' విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి!
కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం అలముకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా స్థానిక థియేటర్లో విజయవంతంగా ఆడుతోంది. దీంతో, విజయోత్సవ వేడుక నిర్వహించాలని భావించారు. అయితే, ఈ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి బాలయ్య వస్తారని ప్రచారం జరగడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ పోలీసు వాహనం అభిమానులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.