: గాలింపు చర్యలకు భారత్ సిద్ధం


ఎయిర్ ఏషియా విమానం గల్లంతవడంపై భారత్ స్పందించింది. గాలింపు చర్యల్లో సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఈ మేరకు అండమాన్ సముద్రంలో గాలించేందుకు మూడు నౌకలు, ఓ విమానాన్ని సిద్ధంగా ఉంచింది. కాగా, ఇండోనేసియాలోని సురబయ నగరం నుంచి సింగపూర్ బయల్దేరిన ఈ విమానం జావా సముద్రంలో బెలిటుంగ్ వద్ద కూలిపోయినట్టు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది.

  • Loading...

More Telugu News