: గ్రామాల్లో 'వెలుగు' నింపుతానంటున్న 'క్రికెట్ దేవుడు'


'క్రికెట్ దేవుడు' సచిన్ టెండూల్కర్ గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించాడు. మారుమూల గ్రామాలకు విద్యుత్ కాంతులు అందించడమే తన లక్ష్యమంటున్నాడు. 'స్టార్ స్పోర్ట్స్'తో మాట్లాడుతూ, క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని అన్నాడు. దాని ద్వారా మరింత సంతృప్తిని కోరుకుంటున్నానని తెలిపాడు. ఇప్పటికీ ఎన్నో గ్రామాలు విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదని, సూర్యాస్తమయం తర్వాత అక్కడ జనజీవనం స్తంభించిపోతుందని ఈ రాజ్యసభ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితిని మార్చాలన్నది తన ఆశయమని చెప్పుకొచ్చాడు. అందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలన్నాడు. గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News