: సీనియర్ దర్శకుడు భాస్కర్ రావు కన్నుమూత
సీనియర్ దర్శకుడు బీరశెట్టి భాస్కర్ రావు (75) కన్నుమూశారు. ఆయన 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. 40 సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా వ్యవహరించారు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం 'చెరపకురా చెడేవు'. గృహప్రవేశం, ధర్మాత్ముడు, భారతంలో శంఖారావం, చదరంగం, ఇంద్రధనుస్సు, చల్ మోహన్ రంగా తదితర చిత్రాలకు ఆయన డైరక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు.