: ప్రధానికి సవాల్ విసిరిన వీహెచ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సవాల్ విసిరారు. ప్రధానికి దమ్ముంటే అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీంను భారత్ కు రప్పించాలని అన్నారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దావూద్ ఇబ్రహీం విషయంపై పాకిస్థాన్ ప్రధానితో చర్చించడం కాదని, అతడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను మోదీ నిలబెట్టుకోవాలని సూచించారు. నల్లధనాన్ని తిరిగి భారత్ కు తీసుకువస్తామన్న మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు.