: 'సాగర్' ప్రమాదంలో ఆటో వెలికితీత... మూడు మృతదేహాలు లభ్యం


నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి నేటి ఉదయం దూసుకెళ్లిన ఆటోను పోలీసులు వెలికితీశారు. ఆటోలో చిక్కుకుని మృత్యువాతపడ్డ ముగ్గురు గొర్రెల కాపరుల మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ లభించలేదు. నేటి ఉదయం నల్గొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు గొర్రెల కాపరులు గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రమాదం నేపథ్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు ఆటోను వెలికితీయగా, మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News