: ఎయిర్ ఏషియా విమానం కోసం గాలింపు ముమ్మరం... ప్రతికూల వాతావరణం అడ్డంకి
ఇండోనేసియా నుంచి సింగపూర్ బయలుదేరి కనిపించకుండా పోయిన ఎయిర్ ఏషియా విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. అదృశ్యమైన విమానం ఆచూకీ కోసం రెండు విమానాలు, ఐదు నౌకలను రంగంలోకి దించినట్లు ఏయిర్ ఏషియా ప్రకటించింది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు ఎక్కడికక్కడ అంతరాయం కలుగుతోంది. మరోవైపు, జావా సముద్రంలో విమాన శకలాలు కనిపించాయన్న మీడియా కథనాలను ఎయిర్ ఏషియా ధ్రువీకరించడం లేదు. సముద్రంలో కనిపించిన శకలాలు తమ విమానానివేనని రూఢీ చేసుకున్న తర్వాతే స్పష్టమైన ప్రకటన చేయాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.