: ఆరు నెలల టీడీపీ పాలనలో అక్రమాలెన్నో: రఘువీరారెడ్డి
చంద్రబాబునాయుడి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో ప్రారంభమైన యూత్ కాంగ్రెస్ సదస్సుకు రఘువీరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలల టీడీపీ పాలనలో పలు అక్రమాలు వెలుగుచూశాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. గడచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో ఇసుమంతైనా అభివృద్ధి నమోదు కాలేదని ఆయన వ్యాఖ్యానించారు.