: మరోమారు విఫలమైన ధోనీ... ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మరోమారు విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నిలకడగా ఆడుతున్న కోహ్లీకి ధోని సహకారం అందించలేకపోయాడు. 23 బంతులను ఎదుర్కొన్న ధోనీ కేవలం 11 పరుగులు చేసి హ్యారిస్ బౌలింగ్ లో బ్రాడ్ హాడిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు ధోనీ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కూడా నిరాశపరిచాడు. నాలుగు బంతులు ఆడిన అశ్విన్, హ్యారిస్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు. వరుసగా వికెట్లు కోల్పోతున్నా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (151) ఒంటరిపోరు సాగిస్తున్నాడు. 118 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 434 పరుగులు చేసింది.