: జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ కొద్దిసేపటి క్రితం ప్రమాణం చేశారు. రాంచీలోని బిర్సాముండా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అహ్మద్, ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నుంచి వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రఘువర్, గతంలో డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. చత్తీస్ గఢ్ కు చెందిన ఈయన, జంషెడ్ పూర్ లోనే స్థిరపడి జార్ఖండ్ రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రానికి తొలి గిరిజనేతర సీఎంగా రికార్డులకెక్కారు.