: తిరుమల వెంకన్న సేవలో సినీ నటుడు శ్రీకాంత్
టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ నేటి ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కొద్దిసేపటి క్రితం సతీసమేతంగా శ్రీకాంత్ వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల ఆలయంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు శ్రీకాంత్ దంపతులకు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. జనవరి నెలలో తన తాజా చిత్రం ‘ఢీ అంటే ఢీ’ విడుదల కానుందని ఆయన చెప్పారు.