: సెంచరీకి చేరువలో కోహ్లీ...అర్ధ శతకంతో రెహానే దూకుడు!


ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో పరాజయం పాలైన టీమిండియా మూడో టెస్టులో విజయం దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 530 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకు భారత్ కూడా దీటుగానే సమాధానమిస్తోంది. రెండో రోజు చివరి సెషన్ లో బ్యాటింగ్ కు దిగిన భారత్, ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(84), రెహానే(71)లు నిలకడగా బ్యాటింగ్ చేస్తుండటంతో భారత్ స్కోరు పరుగులు పెడుతోంది. కోహ్లీ సెంచరీకి చేరువ కాగా, రెహానే కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసి భారత్ ను భారీ స్కోరు దిశగా తీసుకెళుతున్నాడు. 80 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 276 పరుగులకు చేరింది.

  • Loading...

More Telugu News