: తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం...ఆందోళన అవసరం లేదంటున్న వైద్యాధికారులు


తెలంగాణలో స్వైన్ ఫ్లూ నానాటికీ విస్తరిస్తోంది. హైదరాబాదులోని పలు ఆస్పత్రుల్లో ఒకే రోజు ఆరుగురు స్వైన్ ఫ్లూ లక్షణాలతో చికిత్స నిమిత్తం చేరారు. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాధి కారణంగా మృత్యువాత పడటం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి స్వైన్ ఫ్లూ లక్షణాలతో పలువురు రోగులు హైదరాబాదుకు తరలివస్తున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే స్వైన్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ చికిత్సకు సంబంధించి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వైన్ ఫ్లూ నోడల్ ఏజెన్సీ వైద్యాధికారులు భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News