: కూచిపూడిలో రూ.100 కోట్లతో నాట్యారామం... చైర్మన్ గా కూచిభొట్ల ఆనంద్!


కూచిపూడి నాట్యానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాదులోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న సిలికానాంధ్ర కూచిపూడి నాట్యోత్సవాల్లో భాగంగా శనివారం రెండో రోజు కార్యక్రమాలను చంద్రబాబు తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూచిపూడిలో రూ.100 కోట్లతో నాట్యారామాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నాట్యారామం చైర్మన్ గా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ ను నియమిస్తామని తెలిపారు. నవ్యాంధ్ర రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచిపూడిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నారు. నాట్యారామాన్ని 2016లోగా పూర్తి చేసి అంతర్జాతీయ నాట్య సమ్మేళనాన్ని అక్కడే నిర్వహిస్తామని ప్రకటించారు. కళలు, కళాకారులను ప్రోత్సహించే క్రమంలో వృద్ధ కళాకారులకు రూ.1,500 పింఛన్ ను అందజేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News