: మూడో రోజు ఆటలో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్


బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభమైన తొలి సెషన్ లోనే టీమిండియాకు ఆసిస్ షాకిచ్చింది. ఆట ప్రారంభం కాగానే ఆస్ట్రేలియా బౌలర్లు రెండు వికెట్లను పడగొట్టారు. రెండో రోజు ఆటలో శిఖర్ ధావన్ మరోమారు విఫలం కాగా, మూడో రోజు ఆట ప్రారంభం కాగానే రెండో బంతికే చటేశ్వర్ పుజారా (25) హ్యారిస్ బౌలింగ్ లో బ్రాడ్ హ్యాడిన్ చేతికి దొరికిపోయాడు. ఆ తర్వాత ఊపుమీదున్న మురళీ విజయ్ (68) కూడా వాట్సన్ బౌలింగ్ లో షాన్ మార్స్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో 147 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ (38), అజింక్యా రెహానే (24) క్రీజులో ఉన్నారు. 55 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 183 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 530 పరుగులు చేయడంతో భారత్ కూడా అదే రీతిలో భారీ స్కోరు దిశగా సాగితే తప్పించి, పరాజయం నుంచి తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

  • Loading...

More Telugu News