: కేజ్రీవాల్ మీదకు రాయి విసిరిన ఆగంతుకుడు


ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దక్షిణ ఢిల్లీలోని టిగిడి ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఓ ర్యాలీ నిర్వహిస్తుండగా, ఆ ర్యాలీలో పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఇంతలో ర్యాలీలోంచి ఓ ఆగంతుకుడు అరవింద్ కేజ్రీవాల్ పై రాయి విసిరాడు. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి ఆయనకు తగలకుండా పక్కకు వెళ్లింది.

  • Loading...

More Telugu News