: విషాదానికి దారి తీసిన పులి, తాచుపాము పోరాటం


మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలోని కమలానెహ్రూ జంతు ప్రదర్శనశాలలో మూడేళ్ల వయసున్న తెల్లపులిని తాచుపాము కాటువేయడంతో మృత్యువాతపడింది. రాజన్ అనే పులి జంతుప్రదర్శనశాలలోని బోనులో మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. సమీపంలోనే ఓ తాచుపాము గాయాలతో పడిఉన్నట్టు అధికారులు గుర్తించారు. పులి, తాచుపాము మధ్య పోట్లాటలో పులిని పాము కాటువేయడంతో మరణించినట్టు తెలుస్తోందని జంతుప్రదర్శనశాల అధికారులు తెలిపారు. ఈ తెల్లపులిని ఇటీవలే ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ నుంచి తెప్పించినట్టు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా విషం ఎక్కడం వల్లే పులి మృతి చెందినట్టు తేలిందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News