: సినిమాల్లో నటించే ఆలోచన లేదు: మిస్ అమెరికా నీనా దావులూరి


ఇప్పట్లో సినిమాల్లో నటించే ఆలోచన లేదని 'మిస్ అమెరికా' నీనా దావులూరి తెలిపారు. విజయవాడ మూలాలున్న నీనా దావులూరి విజయవాడ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, భారత్ లో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. సెప్టెంబర్ లో మిస్ అమెరికాగా విజయం సాధించినప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆమె చెప్పారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News