: యువజన కాంగ్రెస్ సమావేశం రసాభాస...నేతల ఘర్షణ
గుంటూరు కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ సమావేశం రసాభాసగా ముగిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మానస్ మాలిక్ సమక్షంలో యువనేతలు ఘర్షణకు దిగారు. యువజన కాంగ్రెస్ లో పెత్తనంపై తలెత్తిన వాగ్వాదం, వివాదంగా మారి ఘర్షణకు దారితీసింది. దీంతో విజయవాడ నేత దేవినేని అవినాష్, చిత్తూరు జిల్లా యువజన కాంగ్రెస్ నేతలు ఇన్చార్జీ రాకేష్ మాలిక్ కు ఫిర్యాదు చేశారు.