: క్రాస్ మసాజ్ సెంటర్లపై దాడులు... 16 మంది అరెస్టు
హైదరాబాదు పోలీసులు జూలు విదిలిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్టులు, పబ్బులు, హుక్కా సెంటర్లపై దాడులు నిర్వహించే పోలీసులు మసాజ్ సెంటర్లపై పడ్డారు. తాజాగా మాదాపూర్ ప్రాంతంలో ఉన్న పలు మసాజ్ సెంటర్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో క్రాస్ మసాజ్ లు చేస్తున్న పదిమంది యువతులను, ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. మగవారికి ఆడవాళ్లు మసాజ్ చేయడం నేరమని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ లోని మసాజ్ సెంటర్ల మీద పోలీసులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.