: ధోనీ ప్రపంచ రికార్డు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంప్ అవుట్లు చేసిన వికెట్ కీపర్ గా ధోనీ రికార్డు పుటలకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో మిషెల్ జాన్సన్ ను స్టంప్ అవుట్ చేయడంతో 134 స్టంప్ లు చేసిన వికెట్ కీపర్ గా ధోనీ రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో శ్రీలంక మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ కుమార సంగక్కర పేరిట 133 స్టంపింగ్ లతో ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. కాగా, ధోనీ వన్డేల్లో 85, టీట్వంటీల్లో 11 స్టంపవుట్లు చేశాడు.