: యాసిడ్ దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం: రాజ్ నాథ్ సింగ్
యాసిడ్ దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, యాసిడ్ అమ్మకాలపై దృష్టి సారించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించామని అన్నారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో ఓ వైద్యురాలిపై యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి నేపథ్యంలో యాసిడ్ అమ్మకాల మార్గదర్శకాలను కఠినతరం చేయాలని కేంద్రం ఆదేశించింది.