: స్కైప్, వైబర్ లో మాట్లాడాలనుకుంటున్నారా? ఛార్జీలివే
స్కైప్, వైబర్ తదితర యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాలింగ్ (వీఓఐపీ కాల్స్) కోసం ఎయిర్ టెల్ ప్రత్యేక డేటా ప్యాక్ లను ప్రకటించింది. ఇంటర్నెట్ కాల్స్ పై ఎయిర్ టెల్ అదనపు ఛార్జీల విషయం పరిశీలిస్తామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ ప్రకటించిన తరువాత కూడా ఎయిర్ టెల్ చార్జీలను ప్రకటించడం విశేషం. 75 రూపాయలతో 75 ఎంబీ డేటాతో ప్రత్యేక ప్యాకేజీని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈ 75 రూపాయల రీఛార్జ్ కు 200 నిమిషాల వీఓఐపీ కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది.