: పాక్ సర్కారుకు అందిన లఖ్వీ బెయిల్ కాపీ
ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ మంజూరు చేస్తూ పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా లఖ్వీ బెయిల్ కాపీ ప్రభుత్వానికి అందింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో పాక్ ప్రభుత్వ న్యాయవాది కోర్టులో తీర్పుపై అప్పీలు చేస్తారు. "ఎట్టకేలకు ఇస్లామాబాద్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు నుంచి తీర్పు కాపీని అందుకున్నాం. అప్పీలు దరఖాస్తును తయారుచేసి, ప్రస్తుతం హైకోర్టుకు రెండు వారాలు సెలవులు ఉన్నందున జనవరి మొదటి వారంలో దాఖలు చేస్తాం" అని న్యాయవాది చౌదరి అజహర్ తెలిపారు.