: మూత్ర విసర్జన చేస్తుండగా విద్యుత్ షాక్... వ్యక్తి సజీవదహనం
సికింద్రాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్దనున్న ట్రాన్స్ ఫార్మర్ వెనుక ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ షాక్ కు గురై సజీవదహనమయ్యాడు. దీంతో, అతనిని గుర్తించేందుకు ఎలాంటి ఆధారమూ దొరకలేదు. మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో అతని గురించిన సమాచారం తెలియడం లేదు. కాగా, గతంలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఘటనపై ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.